Share News

Delhi traffic cop assault: ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం.. వాహనదారుడిపై ఎలా దాడి చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:36 PM

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వాహనదారుడిపై దాడి చేశాడు. కారులో ఉన్న యువకుడిని పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది.

Delhi traffic cop assault: ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం.. వాహనదారుడిపై ఎలా దాడి చేస్తున్నాడో చూడండి..
Delhi traffic cop assault

దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వాహనదారుడిపై దాడి చేశాడు. కారులో ఉన్న యువకుడిని పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతోంది. కారు డ్రైవర్ వద్ద సరైన పత్రాలు లేనందున అతడిని కానిస్టేబుల్ కొట్టినట్టు సమాచారం. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (police brutality video Delhi).


వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. యూనిఫాంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ కారులోకి ఎక్కి డ్రైవర్‌పై దాడికి పాల్పడుతున్నాడు. డ్రైవర్ తల వంచి అనేక సార్లు కొట్టాడు. అతడి పైకి ఎక్కి మొహంపై కొట్టాడు. ఆ డ్రైవర్ నొప్పితో అరుస్తున్నా ఆ కానిస్టేబుల్ వెనకడుగు వేయలేదు. బయట ఉన్న వారు ఆ కానిస్టేబుల్ దాడిని వీడియో తీశారు. తనను వీడియో తీస్తున్నారని తెలిసిన తర్వాత ఆ కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడు. డ్రైవర్ ఏడుస్తూ, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది (traffic police misconduct).


ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు (man assaulted inside car). వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోతే అంతలా కొడతారా అని నెటిజన్లు ప్రశ్నించారు. కాగా, ఈ వీడియో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులు సదరు ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. సదరు కానిస్టేబుల్‌పై పై అధికారులు చర్యలు తీసుకుంటారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. అసలేం జరిగిందంటే..


ఈ రైతు తన భార్య కోసం వెతుక్కుంటున్నాడు.. ఎక్కడుందో కనిపెట్టండి..

Updated Date - Dec 16 , 2025 | 06:36 PM