Hyderabad: మీరు ట్యాంక్‌బండ్ వైపు వెళుతున్నారా.. అయితే ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే..
ABN , Publish Date - Sep 27 , 2025 | 07:41 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బతుకమ్మ కార్నివాల్ సందర్భంగా శనివారం అప్పర్ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలిపారు.
- బతుకమ్మ కార్నివాల్ సందర్భంగా.. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బతుకమ్మ కార్నివాల్ సందర్భంగా శనివారం అప్పర్ ట్యాంక్‌బండ్(Upper Tank Bund) పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్(Joint CP Joel Davis) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆంక్షలు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. తెలుగుతల్లి జంక్షన్, కర్బలా మైదాన్ వైపు నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించరు.

ఇక్బాల్ మినార్ వైపు నుంచి వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ టెంపుల్ వైపునకు పంపుతారు. వీవీ స్టాచ్యూ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ, ఐమాక్స్ వైపునకు పంపుతారు. నల్లగుట్ట జంక్షన్(Nallagutta Junction) నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్, నెక్లెస్ రోడ్ వైపునకు పంపుతారు. లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపునకు పంపుతారు. సికింద్రాబాద్(Secunderabad) వైపునుంచి వచ్చే వాహనాలను కర్బలా మైదాన్, బైబిల్ హౌస్ వైపునకు పంపుతారు.

ముషీరాబాద్, కవాడిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్, ధోబీఘాట్‌వైపునకు పంపుతారు. సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎ్‌సకు వెళ్లే ఆర్టీసీ బస్సులను స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, ఫీవర్ ఆస్పత్రి(Tarnaka, Nallakunta, Fever Hospital), బర్కత్‌పురా, నింబోలి అడ్డా మీదుగా పంపుతారు. సిటీ బస్సులను కర్బలా మైదాన్, బైబిల్‌హౌస్, కవాడిగూడ క్రాస్‌రోడ్స్ వైపునకు మళ్లిస్తారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News