Hyderabad: సిటీలో ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ డ్రైవ్.. 3 గంటల్లో.. 6 వేలకు పైగా చలాన్లు
ABN , Publish Date - Oct 20 , 2025 | 06:06 PM
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 20: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అకస్మాత్తుగా సిటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 16న మొజంజాహి మార్కెట్ కూడలిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేవలం 3 గంటల్లోనే 6 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. పట్టుబడుతున్న వాహనదారుల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.
ద్విచక్ర వాహనదారుల్లో ముఖ్యంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రాంగ్‌రూట్‌లో బైక్ నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి అతిక్రమణలపైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు తెలిపారు. ఇలా రూల్స్ అతిక్రమించి డ్రైవ్ చేస్తూ ఒక్క రోజులో సుమారు 15వేల మంది వరకు పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు. మూడు గంటల స్పెషల్ డ్రైవ్‌తోనే సుమారు 6 వేల కేసులు నమోదైతే 24 గంటలూ వాహనాలపై శ్రద్ధపెడితే ఒక్కరోజులోనే సుమారు 20 వేల వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
For More National News And Telugu News