Challans: ఐదు చలాన్లు మించి ఉంటే ఇక మీ బండి సీజ్, లైసెన్స్ రద్దు!
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:26 AM
వాహనదారులూ.. ఇక బి కేర్ ఫుల్. మీ బైక్, స్కూటర్, కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఐదుకు మించి ఉంటే సొమ్ములు కట్టెయ్యాల్సిందే. లేదంటే మీ బండి సీజ్ చేస్తారు. లైసెన్స్ రద్దు..
ఇంటర్నెట్ డెస్క్: వాహనదారులూ.. ఇక బి కేర్ ఫుల్. మీ బైక్, స్కూటర్, కారు మీద ట్రాఫిక్ చలాన్లు ఐదుకు మించి ఉంటే సొమ్ములు కట్టెయ్యాల్సిందే. లేదంటే మీ బండి సీజ్ చేస్తారు. ఎప్పుడో కడదాంలే అని ఊరుకుంటే ఇక కుదరదు. కేంద్రం ఈ మేరకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేస్తూ కేంద్రం కొత్త నిబంధనలు వెల్లడించింది. ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇందులో ఒక వాహనం మీద ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే, సంబంధిత రవాణా అధికారులు ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేయవచ్చు.
అంతేకాదు, ట్రాఫిక్ చలాన్ చెల్లించడానికి ఉన్న గడువును ప్రస్తుతం ఉన్న 90 రోజుల నుండి 45 రోజులకు తగ్గించేశారు. 45 రోజుల్లోగా చలాన్ చెల్లించకపోతే, అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది.
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, 45 రోజుల్లో మీ బండి లేదా స్కూటర్, కారు మీద ఉన్న అన్ని చలాన్లు చెల్లించకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ చేస్తారు. కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ఈ కొత్త ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్ కూడా చేయొచ్చని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News