Major Fire incident On Vijayawada: ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:21 AM
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది.
విజయవాడ, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): విజయవాడ (Vijayawada) రూరల్ మండలం ఎనికేపాడు (Enikepadu)లో ఇవాళ(సోమవారం) భారీ అగ్నిప్రమాదం (Major Fire incident) జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడితుండటంతో విలవైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూ పక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. పొగ ధాటికి స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్థానికులను ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పంపించివేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News