Share News

CRDA Building in Amaravati: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

ABN , Publish Date - Oct 05 , 2025 | 10:04 AM

అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది.

 CRDA Building in Amaravati: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్..  ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
CRDA Building in Amaravati

అమరావతి, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు (CRDA Building in Amaravati) నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలోని రాయపూడిలో నిర్మిస్తున్న సీఆర్డీఏ భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు సీఆర్డీఏ అధికారులు. ఈ నెల 13వ తేదీన సీఆర్డీఏ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) చేతుల మీదగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు సీఆర్డీఏ అధికారులు.


సీఆర్డీఏ భవన పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో టార్గెట్లు పెట్టిన ఇప్పటివరకు వాయిదాల పర్వం కొనసాగింది. ఈసారి పనులన్నీ దాదాపు పూర్తి కావడంతో ఈనెల 13వ తేదీనే ప్రారంభించేందుకు సీఆర్డీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. మున్సిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాలు, హెచ్‌వోడీలు ఇకపై ఇదే భవనం నుంచి పనిచేస్తాయని వెల్లడించారు సీఆర్డీఏ అధికారులు. సీఆర్డీఏ కార్యాలయం సైతం ఈ భవనం నుంచే ఇకపై అమరావతి రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించనుందని సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం

జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2025 | 10:46 AM