Heavy Rains in AP: వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:27 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
విశాఖపట్నం, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh)పై వాయుగుండం ప్రభావం (Cyclone Impact) కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష (Heavy Rains) సూచన ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, అనంతపురంలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అక్కడక్కడ పిడుగులు పడవచ్చని తెలిపారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్
Read Latest AP News And Telugu News