Home » Bharath
మతతత్వ రికార్డులతో మలినమైన వాళ్లకు ఇతరులకు నీతులు చెప్పే నైతికత ఎక్కడిదని పాక్‌ను భారత్ ప్రశ్నించింది. ముందు సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలంటూ దాయాది దేశానికి హితవు పలికింది.
ఐసీటీ ఇచ్చిన తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు.
రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణ్వాయుధ కార్యక్రమాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ రణ్‌దీర్ జైశ్వాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది.
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్‌కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. ఏపీకి వచ్చిన కంపెనీలకి సౌకర్యాలు కల్పించారా అని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో చేపట్టిన ఆందోళనలపై పాక్ బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి.
బికనీర్ మిలటరీ స్టేషన్‌తో సహా పలు ఫార్వార్డ్ ఏరియాల్లో శుక్రవారం నాడు ఉపేంద్ర ద్వివేది పర్యటించారు. బలగాల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.
ఎంతో పేరున్న నాటో నాయకత్వం బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని, ప్రధానమంత్రి సంభాషణలు, సూచనలు వంటి విషయాల్లో ఊహాగానాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.