దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:47 PM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్తును మార్చేస్తున్నారని పేర్కొన్నారు..
కర్నూలు, జనవరి30 (ఆంధ్రజ్యోతి): ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharat) అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్తును మార్చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఓర్వకల్లు విమానాశ్రయం సమీపంలో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను మంత్రి టీజీ భరత్ పున: ప్రారంభించారు. ఉర్దూ యూనివర్శిటీ నిర్మాణానికి మంత్రి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వరుసగా అధికారంలో ఉండి ఉంటే యూనివర్సిటీ భవన నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు.
జగన్ హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు ఆపేశారన్నారు. వీటిలో ఉర్దూ యూనివర్సిటీ, బీసీ భవన్, కాపు భవన్ ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు. మంచి చేసే నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. సరైన విద్యను అందించి విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావొచ్చని తెలిపారు. తమ దావోస్ పర్యటనలో విద్యా వ్యవస్థపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించామని అన్నారు. మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశామని ప్రస్తావించారు. ఎప్పుడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని వివరించారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడుల పనులు ఏపీలో ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
Read Latest AP News And Telugu News