Share News

India China Direct Flights: చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఐదేళ్ల తర్వాత తొలి ఫ్లైట్‌

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:36 AM

భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది.

India China Direct Flights:  చైనా వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఐదేళ్ల తర్వాత తొలి ఫ్లైట్‌
India China flights

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు(India China Direct Flights) తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగో(Indigo airlines)కు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది. ఈ పరిణామం భారత విమానయాన రంగంలోఒక చారిత్రక మైలురాయి అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభివర్ణించింది.


2020 మార్చి వరకు రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిచాయి. ఆ తర్వాత కోవిడ్ వ్యాప్తి(COVID flight suspension)తో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. గల్వాన్ ఘర్షణల పరిణామాలు, ఇతర నియంత్రణ సమస్యల కారణంగా సర్వీసుల పునరుద్ధరణలో జాప్యం జరిగింది. నేరుగా విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కొంతకాలంగా ఇరుదేశాలు పలు దఫాలుగా చర్చలు జరిపాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విమాన సేవలను పునరుద్దరించేందుకు ఇరుదేశాలు(India China) అంగీకరించాయి. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది.


ఈ క్రమంలోనే ఆదివారం తొలి విమానం చైనాకు టేకాఫ్‌ తీసుకుంది. దీంతో ప్రయాణ, వాణిజ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడంలో ఇదొక సానుకూల ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. చైనాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన గ్వాంగ్జౌ నగరానికి భారత్ నుంచి వ్యాపారులు, వాణిజ్య వేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కోల్‌కతా నుంచి గ్వాంగ్జౌకు(Kolkata to Guangzhou flight) నేరుగా విమానాలు నడపనుండటం ఎంతో కీలకం కానుంది. అలానే ఎగుమతిదారులకు రవాణా సౌకర్యాలు(bilateral trade) సులభతరం కానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 08:42 AM