Share News

Pakistan Shock: భారత్-బంగ్లా మ్యాచ్ రద్దుతో.. పాకిస్తాన్‌కు భారీ షాక్

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:09 AM

మహిళా క్రికెట్ వరల్డ్ కప్2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ రద్దుతో పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ఘోర అవమానమే జరిగిందని చెప్పొచ్చు.

Pakistan Shock: భారత్-బంగ్లా మ్యాచ్ రద్దుతో.. పాకిస్తాన్‌కు భారీ షాక్
Pakistan Shock

క్రికెట్ న్యూస్: మహిళా క్రికెట్ వరల్డ్ కప్2025లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. వర్షం కారణంగా తీవ్రంగా ఎఫెక్టైన ఈ ప్రపంచకప్ లీగ్ దశ ముగిసింది. ఈ మ్యాచ్ రద్దుతో పాకిస్థాన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంకా చెప్పాలంటే ఘోర అవమానమే జరిగిందని చెప్పొచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


డీవై పాటిల్ స్టేడియంలో(ICC Women’s World Cup) నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్‌లో(India vs Bangladesh) బంగ్లాదేశ్ జట్టు 27 ఓవర్లలో 119 పరుగులు చేసింది. బంగ్లా జట్టు ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేవలం 53 పరుగులకే 3 కీలక వికెట్లు పడిపోయాయి. అయితే, షర్మిన్ అఖ్తర్ (36), శోభనా మోస్తరీ (26) మంచి భాగస్వామ్యం ఏర్పర్చారు. కానీ 22వ ఓవర్‌లో 91 పరుగుల వద్ద శోభనా ఔటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత ప్రతి ఓవర్‌లో బంగ్లా వికెట్లను కోల్పోతూ వచ్చింది. చివరికి 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 119 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో స్పిన్నర్ రాధా అత్యధికంగా 3 వికెట్లు తీసింది.


డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్(Team India) టార్గెట్ 126 పరుగులుగా నిర్ణయించబడింది. స్మృతి మంధానా(Smriti Mandhana)(34), అమన్‌జోత్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు జోడించారు. ఆ సమయంలో వర్షం మళ్లీ రావడంతో మ్యాచ్ ఆగింది. చాలా సమయం పాటు చూసిన వర్షం ఆగలేదు.దీంతో అంపైర్లు మ్యాచ్‌ను అక్కడే ముగించాలని నిర్ణయించారు. మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో భారత్ బంగ్లాదేశ్‌కు చెరో పాయింట్ లభించింది.


ఇక ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల బంగ్లాదేశ్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం జరిగిందని క్రీడా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు 8వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ 7వ స్థానానికి ఎగబాకింది. మూడు పాయింట్లతో బంగ్లా జట్టు పాకిస్తాన్‌తో సమానంగా నిలిచింది. అయితే, బంగ్లాదేశ్ ఒక మ్యాచ్(Bangladesh women team) గెలిచింది. అది కూడా పాకిస్థాన్ పైనే కావడం విశేషం. కానీ పాక్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేకపోయింది. దీంతో అందుకే పాకిస్తాన్ టోర్నమెంట్‌లో చిట్టచివరి స్థానంలో(Pakistan last position) నిలిచింది. ఇది ఆ జట్టుకు, ఆ దేశక్రికెట్ అభిమానులకు బిగ్ షాకే. తాము ప్రపంచ కప్ గెలిస్తే..ఐసీసీ ఛైర్మన్ జై షానుంచి తీసుకోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్.. కప్ గురించి పక్కన బెడితే..కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమన్హారం.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 08:22 AM