AP Govt Serious Blue Media: కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:46 PM
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ (Kurnool Bus Incident) బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీ(YSRCP)కి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బస్సు ప్రమాదంతో ఏపీ ప్రభుత్వం (AP Government)పై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది వైసీపీ బ్లూ మీడియా. అయితే, ఈ దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చంద్రబాబు సర్కార్ సీరియస్ అయింది.
అవాస్తవాలతో ప్రజల్లో అపోహలు సృష్టించేలా బ్లూ మీడియా అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తోందని కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. పెద్ద టేకూరులోని లైసెన్స్ పొందిన రేణుక ఎల్లమ్మ వైన్స్ నుంచి లిక్కర్ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. రెండుసార్లు లిక్కర్ కొన్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయిందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాత్రి ఏడు గంటలకోసారి... ఆ తర్వాత 8:25లకు మరోసారి మద్యం కొనుగోలు చేశారని ఎక్సైజ్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
అయితే, పెద్దటేకూరు, ఆ సమీపంలో మద్యం షాపులు మాత్రమే ఉన్నాయని.. బెల్ట్ షాపులు అసలు లేవని ఎక్సైజ్ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. పెద్దటేకూరు, ఆ సమీపంలో ఉన్న మద్యం షాపులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తోన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అబద్దపు కథనాలు ప్రసారం చేసిన బ్లూ మీడియా, తదితర వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.
కాగా, మద్యం మత్తులో బైకర్ శివశంకర్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆ తర్వాత రోడ్డుపై పడిన బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. FSL రిపోర్టులో శివశంకర్ మద్యం తాగినట్లు తేలిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News