Bhanuprakash: పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
ABN , Publish Date - Oct 26 , 2025 | 02:38 PM
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వర స్వామివారి సొమ్ములు కాజేశారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): పరకామణి వ్యవహారం (Parakamani)లో నిందితులను వదిలిపెట్టమని తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి (Bhanuprakash Reddy) హెచ్చరించారు. జగన్ హయాంలో కొంతమంది రాజకీయ నేతల అండదండలు చూసుకొని వేంకటేశ్వరస్వామి సొమ్ములు కాజేశారని ఆరోపించారు. శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన సొమ్మును కాజేసిన దొంగను పట్టుకోకుండా.. ఇంకొందరూ వ్యక్తులు కలిసి కాజేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు భానుప్రకాష్ రెడ్డి.
పరకామణి వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దొంగలను పట్టుకుంటామని హెచ్చరించారు. అయితే, పరకామణి వ్యవహారం గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తాను టీటీడీలో రేపు ఉంటానో, ఉండనో తెలియదని చెప్పుకొచ్చారు. పరకామణి వ్యవహారంలో మీడియా సమావేశం పెట్టకుండా కొంతమంది తనపై విపరీతమైన ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు భాను ప్రకాష్ రెడ్డి.
ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని తాజ్ డక్కెన్‌లో తాళ్లపాక రాఘవన్ అన్నమాచార్య 12వ తరం వంశీయులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భానుప్రకాష్ పాల్గొని ప్రసంగించారు. పరకామణి వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో బయటపడాలని కోరారు. ఈ కేసుపై పూర్తిగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పరకామణి వ్యవహారంలో వాస్తవాలు భక్తులందరికీ తెలియాలని చెప్పుకొచ్చారు భాను ప్రకాష్ రెడ్డి.
సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని కొంతమంది టార్గెట్ చేశారని వాపోయారు. తాను టీటీడీ బోర్డు మెంబర్ అయినా.. పరకామణి వ్యవహారంలో ఇంప్లిడ్ అయ్యే అవకాశం లేదని అడ్వొకేట్ చెప్పారని పేర్కొన్నారు. తనకు బోర్డు మెంబర్ పదవి పోయినా ఫర్వాలేదని... తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. పరకామణి వ్యవహారంలో వాస్తవాలు బయటపడాలని తాను పోరాడుతున్నానని భానుప్రకాష్ రెడ్డి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News