Share News

Foxconn Expands Production: హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 03:54 AM

యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీకి భాగ్యనగరం హబ్‌గా అవతరించబోతోంది. యాపిల్‌ సంస్థ కోసం ఎయిర్‌పాడ్స్‌ తయారు చేస్తున్న తైవాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కు చెందిన హైదరాబాద్‌ యూనిట్‌ ‘ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ’...

Foxconn Expands Production: హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి నెలకు 2 లక్షల యూనిట్లకు పెంపు

మరో రూ.1,800 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీకి భాగ్యనగరం హబ్‌గా అవతరించబోతోంది. యాపిల్‌ సంస్థ కోసం ఎయిర్‌పాడ్స్‌ తయారు చేస్తున్న తైవాన్‌ ఎలకా్ట్రనిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌కు చెందిన హైదరాబాద్‌ యూనిట్‌ ‘ఫాక్స్‌కాన్‌ ఇంటర్‌కనెక్ట్‌ టెక్నాలజీ’ (ఎఫ్‌ఐటీ) ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. హైదరాబాద్‌ సమీపంలోని కొంగరకలాన్‌ ప్లాంట్‌ లో కంపెనీ ప్రస్తుతం నెలకు 1,00,000 యూనిట్లకు పైగా ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా హైదరాబాద్‌లోని యూనిట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 2,00,000 యూనిట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వచ్చే 6-8 నెలల్లో ప్రొడక్షన్‌ లైన్లను విస్తరించడంతో పాటు మరో 3,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 2,000 మంది పనిచేస్తున్నారు.

చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంలో భాగంగా: ఫాక్స్‌కాన్‌ తన తయారీ కార్యకలాపాలను చైనాను దాటి విస్తరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించటంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఎయిర్‌పాడ్స్‌ తయారీ ప్లాంట్‌ను భారీగా విస్తరిస్తోంది. ఇందుకనుగుణంగానే తైవాన్‌లోని ప్లాంట్ల నుంచి అవసరమైన తయారీ యంత్రాలను ఇక్కడి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో యాపిల్‌ మార్కెట్లోకి విడుదల చేసిన ఎయిర్‌పాడ్స్‌ 4, ఎయిర్‌పాడ్స్‌ ప్రో 3 మోడళ్లను ఉత్పత్తి చేసేందుకు ఈ యంత్రాలను వినియోగించనున్నట్లు సమాచారం. కాగా ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే హైదరాబాద్‌ యూనిట్‌ కోసం రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజాగా చేపట్టనున్న విస్తరణ కోసం మరో రూ.1,800 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 03:54 AM