Rohit Sharma: రోహిత్ మనసును చదివిన మెజీషియన్
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:32 PM
ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు, స్నేహితులు ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా (Australia) పర్యటన నుంచి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్వదేశానికి వచ్చేశాడు. మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్.. సిడ్నీ (Sydney)కి సెలవంటూ ఆసీస్ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. అయితే అంతకంటే ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ మదిలో ఏమనుకుంటున్నాడో ఓ మెజీషియన్ చెప్పడమే దీనికి కారణం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా క్రికెటర్లు, టీవీ రిపోర్టర్లు,స్నేహితులు ఉండటం గమనార్హం.
ఆసీస్‌ను వీడే ముందు సన్నితులకు రోహిత్ శర్మ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా మెజీషియన్ ఆనంద్ ఓ తమాషా చేసి చూపించాడు. దానిని చూసి అందరూ షాక్ అయ్యారు. మెజీషియన్ ఆనంద్.. రోహిత్‌ను తన మనసులోనే ఇటీవల మాట్లాడని ఓ వ్యక్తి పేరును తలచుకోమని సూచించాడు. రిలాక్స్‌గా ఉంటూ ముందుకు చూడమని రోహిత్‌కు చెప్పాడు. రోహిత్ కూడా ఓ పేరును పదేపదే అనుకున్నాడు.
శర్మ తలచుకున్న పేరును చెబుతున్నానంటూ మొబైల్ ఫోన్‌లో మిగతా వ్యక్తులకు కనిపించేలా ఆనంద్ రాసి చూపించాడు. అప్పుడే ఎవరూ చెప్పవద్దని కోరాడు. చివరికి రోహిత్ వైపు తిరిగిన ఆనంద్.. ‘మీరు తలచుకున్న పేరు ఏంటో చెప్పండి’ అని అడిగాడు. దానికి స్పందించిన రోహిత్ ‘అజాన్’ అని చెప్పగానే మిగిలినవారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడే అసలు ఆ అజాన్ ఎవరు? అనే చర్చ మొదలైంది. సరదాగా అభిమానులు కూడా దీనిపై కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు.
ఇవి కూడా చదవండి
2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి