Ajinkya Rahane criticizes BCCI: సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:46 PM
దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా.. వయస్సు ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాడి ఫామ్ కాకుండా వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజింక్యా రహానే 159 పరుగులతో అదరగొట్టాడు.
క్రీడా వార్తలు: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ అజింక్యా రహానే (Ajinkya Rahane) అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా.. వయస్సు ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాడి ఫామ్ కాకుండా వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజింక్యా రహానే 159 పరుగులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అజింక్యా రహానే.. సెలెక్టర్ల తీరును తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
రహానే(Ajinkya Rahane) మాట్లాడుతూ...'వయసు కేవలం అంకె మాత్రమే. అనుభవం కలిగిన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలి. ఏజ్(Ajinkya Rahane age issue) ఏ మాత్రం ముఖ్యం కాదు. ఆడాలన్న కసి, తపన ముఖ్యం. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో నా అవసరం కనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ బీసీసీఐ సెలెక్టర్లు నా ఏజ్ ను పరిగణలోకి తీసుకొని పక్కనపెట్టారు. ఇది నన్ను చాలా బాధించింది.
ఆస్ట్రేలియా ప్లేయర్ మైకేల్ హసీ 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేందుకు అనుభవం చాలా ముఖ్యం. అందుకే ఆస్ట్రేలియాలో నా అవసరం ఉంటుందని అనుకున్నాను. నాలాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. జట్టులో నుంచి తప్పించేటప్పుడు కూడా సెలెక్టర్లు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం దారుణం. గత నాలుగైదేళ్లుగా దేశవాళీలో(Rahane domestic cricket) ఆడుతున్నాను. నిలకడగా రాణిస్తున్నా' అని రహానే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రహానే వయస్సు 37 ఏళ్లు.
ఇవి కూడా చదవండి
ముంచుకొస్తున్న మొంథా.. మూడు రోజులు సెలవులు
Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
Read latest AP News And Telugu News