Share News

Pratika Raval Injury: సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!

ABN , Publish Date - Oct 27 , 2025 | 12:13 PM

మహిళల వన్డే ప్రపంచకప్‌2025లో సెమీస్ ముగింట భారత్ కు బిగ్ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్‌ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్‌ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.

Pratika Raval Injury: సెమీఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్!
Pratika Raval

క్రీడా న్యూస్: మహిళల వన్డే ప్రపంచకప్‌(World Cup 2025)లో సెమీస్ ముగింట భారత్ కు బిగ్ షాక్ తగిలింది. నిన్న (అక్టోబర్‌ 26) బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ తీవ్రంగా గాయపడింది. దీంతో సెమీస్‌ మ్యాచ్‌కు ఆమె అందుబాటులో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అక్టోబర్‌ 30న జరిగే సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ప్రతీకా గాయం టీమిండియా ఫ్యాన్స్ తో పాటు జట్టును టెన్షన్ పెడుతోంది.


భారత ఓపెనింగ్ బ్యాట్స్‌వుమెన్ ప్రతీకా రావల్(Pratika Raval) ఆదివారం డివై పాటిల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌(India Bangladesh match)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఆమె కుడి కాలు చీలమండకు గాయమైంది. అంతేకాక వెంటనే ఆమె కుంటుకుంటూ గ్రౌండ్ ను వీడింది. డీప్ మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీకా.. 21వ ఓవర్‌లో బౌండరీ వెళ్తున్న బంతిని ఆపే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో ఆమె పట్టుతప్పి కిందపడింది. ఈ క్రమంలో ప్రతీక కుడికాలు మెలికపడింది. దీంతో ఆమె కాసేపు నొప్పితో విలవిల్లాడిపోయింది. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చి వైద్య బృందం ఆమెను పరీక్షించింది. అనంతరం ఆమె ఇబ్బంది పడుతూ గ్రౌండ్ ను వదలి వెళ్లింది. ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా తడి మైదానంలో ఆమె కాలు ఇరుక్కుపోయినట్లు అనిపించింది.


న్యూజిలాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ప్రతీకా రావల్ 122 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఈమె ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత్ సెమీస్ కు చేరేందుకు ఉపయోగపడింది. అయితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో దురదృష్టవశాత్తు గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో(India vs Australia semi final) ప్రతీకా రావల్ ఆడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ప్రతీకా స్థానాన్ని భర్తీ చేసే ఓపెనర్ ఎవరూ జట్టులో లేరు. ఐసీసీ అంగీకారంతో రిజర్వ్‌లలో లేని ప్లేయర్‌ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ప్రతీకా పూర్తిగా టోర్నీ నుంచి తప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది. ఇదే సమయంలో ఆమె హెల్త్ అప్ డేట్ కోసం అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 12:13 PM