Share News

Supreme Court: వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు...

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:39 AM

దేశంలో కుక్కల దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి కుక్కల బెడదా కారణమని సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court: వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు...
Supreme court

ఢిల్లీ: వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారు..? అని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కల దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి కుక్కల బెడద కూడా కారణమని సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.


సుప్రీం నియమాలను అమలుచేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని.. రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేస్తున్నట్లు జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాల.. అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి జస్టిస్ విక్రమ్ నాథ్ వాయిదా వేశారు. అలాగే అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని సీఎస్‌లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:00 PM