Sunil Gavaskar: 2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:26 PM
రోహిత్, విరాట్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్ కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు.
సీనియర్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2027 ప్రపంచ కప్‌లో ఆడుతారా? లేదా? అని సందేహాలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఫిట్‌నెస్, ఫామ్‌తో ఉన్న వీరిద్దరూ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుత ప్రదర్శన చేసి విమర్శకుల నోర్లు మూయించారు. రోహిత్ శర్మ తొలి వన్డేలో నిరాశపరిచినా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీ, సెంచరీతో అదరగొట్టాడు. మరోవైపు విరాట్ కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగినా.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి మెరిశాడు.
అయితే 2027 ప్రపంచ కప్‌లో రో-కో ఆడటంపై భారత దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) స్పందించాడు. ‘రోహిత్(Rohit Sharma), విరాట్(Virat Kohli) వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నారని తెలియగానే 2027 ప్రపంచ కప్(WC 2027) కోసం వారు ఉండాలనుకుంటున్నారని స్పష్టమైంది. వాళ్లు ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. పరుగులు చేసినా చేయకపోయినా.. వారి సామర్థ్యం, అనుభవాన్ని బట్టి వరల్డ్ కప్ తుది జట్టులో రో-కో కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మూడో వన్డేలో వారి ప్రదర్శన చూసిన తర్వాత వారి పేర్లను నేరుగా తుది జట్టులోని రాసుకోవచ్చు’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
గత వారం వన్డే సిరీస్‌లో వరుసగా రెండు డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ అజేయంగా 74 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో సిరీస్‌ను ముగించాడు. వారి ప్రదర్శన, ఆధిపత్యం ఒక కష్టమైన లక్ష్యాన్ని సులభమైన ముగింపుగా మార్చాయి. దీంతో 2027 ప్రపంచ కప్‌లో వారి ఆడుతారు అనే విషయానికి బలం చేకూర్చింది.
సునీల్ గావస్కర్ అభిప్రాయం గత కొన్ని వారాల విమర్శల నుంచి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ చాలా మంది ప్రధాన ఈవెంట్‌కు ముందు ఈ సీనియర్ ఆటగాళ్లను సిరీస్‌లో ఆడించాలా? లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే సునీల్ గావస్కర్ కేవలం అభిమానంతో కాకుండా రో-కో గురించి విశ్వసనీయమైన నాణ్యతకు కొలమానంగా అభివర్ణించారు. ఆటగాళ్లు అందుబాటులో, ఫిట్‌గా ఉంటే.. వారి స్థాయి అనేది అప్పుడప్పుడు వచ్చే ఫామ్ హెచ్చుతగ్గుల కంటే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News