Venkat ON Srikanth Bharat Complaint: గాంధీపై శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలు.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:29 PM
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్,అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీ (Mahatma Gandhi)పై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ (Film actor Srikanth Bharat) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Congress MLC Balmoor Venkat) ఇవాళ(శనివారం) బషీర్ బాగ్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాక్ స్వాతంత్రం పేరిట హద్దులు మీరి కొంతమంది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని కోరారు. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచుని కలిసి శ్రీకాంత్ భరత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతామని పేర్కొన్నారు బల్మూర్ వెంకట్.
గాడ్సే వారసులమని చెప్పుకునే కొంతమంది జాతిపిత మహాత్మాగాంధీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో శ్రీకాంత్ భరత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శ్రీకాంత్ భరత్‌పై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
Read Latest Telangana News and National News