Share News

High Court on GO -9 Copy: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:08 AM

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో జీవో నెంబర్- 9 మీద తెలంగాణ హై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆర్డర్ కాపీ ఉంది. జీవో నెంబర్- 9కి చట్టబద్ధత లేదని హై కోర్టు స్పష్టం చేసింది.

High Court on GO -9  Copy: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
High Court on GO -9 Copy

హైదరాబాద్, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) చేతిలో జీవో నెంబర్- 9 మీద తెలంగాణ హై కోర్టు (Telangana High Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ఆర్డర్ కాపీ ఉంది. జీవో నెంబర్- 9కి చట్టబద్ధత లేదని హై కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పుల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. జీవో నెంబర్లు-9, 41, 42ల పైన మాత్రమే స్టే విధించింది హైకోర్టు. ఆర్డర్ కాపీలో సుప్రీంకోర్టు కేసు జడ్జిమెంట్లను ప్రస్తావించింది హైకోర్టు.


రాహుల్ రమేష్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు వెల్లడించింది. 42శాతం జీవోపై స్టే విధించడంతో, ఓపెన్ క్యాటగిరిలో సీట్లను నోటిఫై చేసి ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్-3వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జడ్జ్‌మెంటులని మెన్షన్ చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎన్నికల నోటిఫికేషన్ మీద ఎలాంటి స్టే విధించలేదని హై కోర్టు స్పష్టం చేసింది.


పాత విధానం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు

మరోవైపు.. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికల పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం దాటకుండా నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వుల్లో న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని ఆదేశించింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని సూచించింది హై కోర్టు.


బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఉత్తర్వులపై స్టే ఇచ్చింది హైకోర్టు. జీవోలు 9, 41,42లపై హై కోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఓపెన్ కేటగిరీ సీట్లను నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని తేల్చిచెప్పింది. 2022లో రాహుల్ రమేష్వాగ్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావించంది కోర్టు. రిజర్వేషన్లు 50శాతం దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పెంచిన 17శాతం సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది హైకోర్టు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.


ప్రభుత్వానికి హై కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ

కాగా, తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ చేరింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చలు చేస్తోంది ప్రభుత్వం. హై కోర్టు ఇచ్చిన స్టే ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లడంపై సీనియర్ న్యాయవాదులు సలహాలని తీసుకుంటుంది రేవంత్‌రెడ్డి సర్కార్. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.


సీనియర్ కౌన్సిల్‌తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. న్యాయ పోరాటం చేస్తునే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడంపై కసరత్తు చేస్తోంది. ఈ నెల 15వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో హైకోర్టు ఉత్తర్వులపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.


ఈ వార్తలు కూడా చదవండి..

లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 10:06 AM