Narsingi Drugs Case: నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:18 AM
నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు ఎయిర్ లైవ్ పబ్ పార్టనర్ విశ్వత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): నార్సింగి డ్రగ్స్ కేసు (Narsingi Drugs Case)లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీజే ప్లేయర్ పెట్టే కార్తికేయ శేఖర్‌తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు ఎయిర్ లైవ్ పబ్ పార్టనర్ విశ్వత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నార్సింగి డ్రగ్స్ కేసులో అనంత కుమార్, వీరబాబు కీలకంగా ఉన్నారు. ఏడాదిన్నర కాలంలో వీరబాబు ద్వారా సుమారు 20 సార్లు కొకైన్ తెప్పించాడు అనంత కుమార్. ఆయన సూచన మేరకు ముంబైలో డ్రగ్ ఫెడ్లర్ల నుంచి కొకైన్ కొనుగోలు చేసి తీసుకువస్తున్నాడు వీరబాబు. ముంబై వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు విమానాలు, ట్రావెల్స్ బస్సుల ద్వారా డ్రగ్స్ హైదరాబాద్‌కి తెస్తున్నాడు వీరబాబు.
ముంబై నుంచి తీసుకువస్తున్న డ్రగ్స్‌ని హైదరాబాద్‌లో అనంత కుమార్‌కి అప్పగించాడు వీరబాబు. ముంబై నుంచి కొకైన్ తీసుకువచ్చిన ప్రతిసారి రూ.15వేలు వీరబాబుకి ఇచ్చాడు అనంత కుమార్. ముంబై వెళ్లిన ప్రతిసారి 100 గ్రాముల కొకైన్ తీసుకు వచ్చాడు వీరబాబు. హైదరాబాద్‌లో గ్రాము కొకైను రూ.6వేల నుంచి రూ. 8 వేలకు విక్రయించారు నిందితులు. అనంత కుమార్ డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించాడరనే కోణంలో నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News and National News