Share News

MP Sri Bharat Fires on Ysrcp: జగన్ హయాంలో అభివృద్ధి కన్నా విధ్వంసం ఎక్కువ: ఎంపీ శ్రీ భరత్

ABN , Publish Date - Oct 03 , 2025 | 09:42 PM

పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్‌కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. ఏపీకి వచ్చిన కంపెనీలకి సౌకర్యాలు కల్పించారా అని ఎంపీ శ్రీ భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు.

MP Sri Bharat  Fires on Ysrcp: జగన్ హయాంలో అభివృద్ధి కన్నా విధ్వంసం ఎక్కువ: ఎంపీ శ్రీ భరత్
TDP MP Sri Bharat Fires on Ysrcp

విశాఖపట్నం, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో అభివృద్ధి కన్నా... విధ్వంసం ఎక్కువ అయిందని తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ (Visakhapatnam TDP MP Sri Bharat) విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో వస్తే, పరిస్థితి ఏమిటని పరిశ్రమల వర్గాలు తమ ప్రభుత్వాన్ని అడుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలోనే పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి అంశాన్ని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలో ఎంపీ శ్రీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మీడియాతో మాట్లాడారు. టీసీఎస్‌కి తమ ప్రభుత్వం భూమిని తక్కువకి ఇవ్వడానికి కారణం అత్యంత వేగంగా పెట్టుబడి విశాఖలో పెడతారనే అని తెలిపారు ఎంపీ శ్రీ భరత్.


రూ. 8 వేల కోట్ల పై బడి టర్నోవర్ ఉన్నవారికి మాత్రమే భూములు తక్కువ ధరకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. గూగుల్ రూ.50 వేల కోట్ల పెట్టుబడితో విశాఖకు వస్తోందని వివరించారు. పరిశ్రమలను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పోగు చేసుకున్న ల్యాండ్ పోతుందనే భయం వారికి ఉందని విమర్శించారు. ఇన్ఫోసిస్‌కి జగన్ హయాంలో ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చారా.. ఏపీకి వచ్చిన కంపెనీలకి సౌకర్యాలు కల్పించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. గూగుల్ ఏర్పాటు చేసే తర్లవాడలో ఎకరం రూ. 50 లక్షలు వరకు భూమిని ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు సొంత కాళ్ల మీద ఎదగడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు. ఇన్ఫోసిస్ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, జీసీసీలు ఏర్పాటు చేస్తే, ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నామని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 09:50 PM