Share News

AP Cabinet Meeting ON Key Issues: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ

ABN , Publish Date - Oct 03 , 2025 | 03:27 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

AP Cabinet Meeting ON Key Issues: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ
AP Cabinet Meeting ON Several Key Issues

అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో మంత్రివర్గం సమావేశం (AP Cabinet Meeting) జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. ఈ భేటీలో 21 అంశాలపై మంత్రిమండలిలో మాట్లాడనున్నారు. ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024-2029 అనుబంధ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.


జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు ఓకే చెప్పనుంది. కారవాన్‌ పర్యాటకానికి ఆమోదం తెలపనుంది. అమృత్‌ పథకం 2.0 పనులపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్‌ పర్సస్ వెహికల్‌ ఏర్పాటుకు ఆమోదించనుంది కేబినెట్.


అమరావతి (Amaravati)తో సహా ఏపీ వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఓకే చెప్పనుంది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్టసవరణ ప్రతిపాదనను ఆమోదించనుంది. విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

దసరా ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై అరుదైన రికార్డ్

మలేషియా ప్రతినిధులతో నారాయణ కీలక భేటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 03:45 PM