తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:14 PM
వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని.. అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలిచ్చామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అమరావతి, జులై 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని.. అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలిచ్చామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) పేర్కొన్నారు. స్పీకర్‌గా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఇంత దారుణాలకు ఓడగొడతారా? అని ప్రశ్నించారు. ఈరోజు(బుధవారం) అమరావతి వేదికగా మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తన మీద పెట్టింది తప్పుడు కేసులని.. అరెస్ట్ సమయంలో తన ఇంట్లోనే ధైర్యంగా ఉన్నానని స్పష్టం చేవారు. తప్పు చేసిన ఎవరినైనా కచ్చితంగా చట్టప్రకారం శిక్షించటమే కూటమి ప్రభుత్వ విధానమని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ఆదరా బాదరా అరెస్టులు చేయడం తమ సంస్కృతి కాదని తేల్చిచెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ హయాంలో స్పీకర్‌గా, మంత్రిగా చేసిన వాళ్ల దారుణాలు చూసి నివ్వెరపోయానని వ్యంగ్యంగా అన్నారు.
బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించారు..
బతికి ఉన్న ఓ వ్యక్తిని చనిపోయినట్లుగా చిత్రీకరించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇద్దరి నాయకుల చర్యలతో శ్రీకాకుళం జిల్లా పరువు పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జిల్లా పరువు తీసిన వారిని ధర్మాన లాంటి నాయకులు వెళ్లి పరామర్శించటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారికి, పరామర్శకు వెళ్లే వారిద్దరికీ సిగ్గు లేనట్లుగా గొడ్డలి పార్టీ నేతలు తయారయ్యారని సెటైర్లు గుప్పించారు. సిగ్గుమాలిన పనులు చేసి, ఇంకా ఏ ముఖం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రిగా చేసినతను గొర్రెల కాపరి చనిపోతే మానవత్వం మరిచి సాక్ష్యాలు తారుమారు చేయాలని చూశారని ఆగ్రహించారు. అధినేత గొడ్డలి సంస్కృతికి తగ్గట్టే నేతలూ ఉన్నారని సెటైర్లు వేశారు. సిగ్గు ఉన్నవారు ఎవరైనా ఇలాంటి వాటిని సమర్థించరని.. కానీ జగన్ సమర్థించారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి గొడ్డలి పార్టీ అవసరమా అని ప్రజలంతా ఆలోచించాలని పేర్కొన్నారు.
రైతన్నల సమస్యను పరిష్కరిస్తున్నాం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వ్యవసాయ రంగాన్ని ఆయన నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పొగాకు, ఆక్వా రైతుల సమస్యకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే పరిష్కారం లభించనుందని వ్యాఖ్యానించారు. రైతన్నల ప్రతీ సమస్యను చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందని స్పష్టం చేశారు. పొగాకు రైతులతో జగన్ ఉత్తుత్తి సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పొగాకు కొనుగోళ్ల సమస్య తమ ప్రభుత్వం దృష్టికి రాగానే సీఎం చంద్రబాబు స్వయంగా సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు.
కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు..
పొగాకు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో ఫలవంతమైన చర్చలు చూసి జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించే అంశంలోనూ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలకు రైతు కండువాలు వేసి జగన్ డ్రామాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్
నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత
తమ్మినేని సీతారం భూ అక్రమాలపై చర్యలుంటాయి: మంత్రి అనగాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News