Home » Agriculture
దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం ఇప్పటికీ మన జీవన విధానంలో భాగమేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్రి బిజినెస్ అవార్డులు ఇవ్వడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న రైతులు, ఇన్నొవేటర్స్, అగ్రిప్రెన్యూర్స్‌లని గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.
మూడు రోజులపాటు ప్రజలను అవస్థలకు గురిచేసింది. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన స్థాయిలో తుఫాన్ తీవ్రత లేకున్నా నష్టాన్ని మాత్రం ఓ మాదిరిగా మిగిల్చింది. ఇలా జిల్లాలో మొంథా వల్ల కలిగిన నష్టం రూ.38.21 కోట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అన్నదాత పంట పండింది.. ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ సేకరించేవారు.
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు.
ఏపీ సచివాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం.
ఉద్యోగం అంటే సౌకర్యం.. శాలరీ అంటే సేఫ్టీ. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి కష్టమైన, విలువైన మార్గాన్ని ఎంచుకుందీ ఒక మహిళ. ఆఫీసు కుర్చీ వదిలి, పొలం మట్టిలో అడుగు పెట్టింది. ప్రకృతిని నమ్ముకుని, సహజత్వాన్ని ఆయుధంగా మలుచుకుంది ఆ మహిళ.
ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్‌ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు.
రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు గడించడంతో పాటు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ABN ప్రత్యేక కథనాన్ని చూడండి.
మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.