PM Modi: రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:54 PM
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు.
న్యూఢిల్లీ: రైతులకు కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసేందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. 2004 నుంచి 2014 వరకూ యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అయితే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 11 ఏళ్లుగా రైతుల అభివృద్ధి, స్వయం సమృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుందని వివరించారు. న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం నాడు జరిగిన ప్రత్యేక కృషి ప్రోగ్రాంలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా గత నెలలో అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ సంస్కరణతో రైతులు, దేశంలోని గ్రామీణ రంగానికి మరింత ప్రయోజనం చేకూరిందని మోదీ చెప్పారు.
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యవసాయరంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని వివరించారు. గత ప్రభుత్వాలకు వ్యవసాయంపై ఎలాంటి విజన్ లేదని విమర్శించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన వివిధ శాఖలు ఇష్టారీతిలో వ్యవహరించడం వల్ల దేశంలోని వ్యవస్థాయ వ్యవస్థ బలహీనమవుతూ వచ్చందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలో మార్పులు చేస్తూ విత్తనాల దగ్గర నుంచి మార్కెట్ వరకూ రైతులకు ప్రయోజనాలు చేకూరే లెక్కలేనని సంస్కరణలు తెచ్చామని చెప్పారు.
వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు
దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయని, ఆహారధాన్యాలు, పళ్లు, కాయగూరల ఉత్పత్తి సుమారు 90 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని, గతంలో ఇది 64 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండేదని చెప్పారు. 2014 నుంచి తేనె ఉత్పత్తి రెట్టింపు అయిందని అన్నారు. అభివృద్ధి భారతాన్ని కోరుకుంటే ప్రతి రంగంలోనూ ఇండియా బలపడాల్సి ఉంటుందన్నారు. ఏవో కొన్ని సాధించినంత మాత్రాన తృప్తి పడిపోరాదని సూచించారు. వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టినప్పుడే గణనీయమైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇవాళ యాస్పిరేషనల్ జిల్లాల్లో ప్రసూతి మరణాలు తగ్గాయని, చైల్డ్ హెల్త్ మెరుగైందని, విద్యాప్రమాణాలు పెరిగాయని చెప్పారు. దీంతో ఈ జిల్లాలు ఇతర జిల్లాల కంటే మెరుగైన రీతిలో దూసుకెళ్తున్నాయని, ఈ మోడల్ ఆధారంగా వ్యవసాయంలో వెనుకబడిన 100 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించామని, ఇందువల్ల అవి మరింత మెరుగైన జిల్లాలుగా మారనున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రైతుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. నేటి నుంచి షురూ!
చినాబ్‌పై సావల్‌కోట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News