Share News

Rivers Sawalkot Hydroelectric Project: చినాబ్‌పై సావల్‌కోట్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Oct 11 , 2025 | 06:26 AM

సింధు జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్ముకశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.....

Rivers Sawalkot Hydroelectric Project: చినాబ్‌పై సావల్‌కోట్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 10: సింధు జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత జమ్ముకశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే చినాబ్‌ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించే దిశగా కీలక ముందడుగు పడింది. జమ్ముకశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) లిమిటెడ్‌ నిర్మించే 1,856మెగావాట్ల ప్రాజెక్టు.. పశ్చిమాన ప్రవహించే చినాబ్‌ నదిపై నిర్మించనున్న అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్లో ఒకటి.

Updated Date - Oct 11 , 2025 | 06:35 AM