Share News

PM Dhan Dhanya Yojana: రైతుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. నేటి నుంచి షురూ!

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:51 AM

పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న (PM Dhan Dhanya Yojana) అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. వ్యవసాయంపై రైతుల్లో కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు రైతులతో వర్చువల్‌గా మాట్లాడతారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

PM Dhan Dhanya Yojana: రైతుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. నేటి నుంచి షురూ!
PM Dhan Dhanya Yojana

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ వ్యాప్తంగా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని వెనుక బడిన జిల్లాలో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు, రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధ‌న్ ధాన్య యోజ‌న(PM Dhan Dhanya Yojana) అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీంను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. వ్యవసాయంపై రైతుల్లో కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా.. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఈ మేరకు రైతులతో వర్చువల్‌గా మాట్లాడతారు.


వ్య‌వ‌సాయాన్ని డెవలప్ మెంట్ చేయడం మాత్రమే కాకుండా రైతుల ఆదాయం పెంచడంకోసం తీసుకొచ్చిన ఈ ప‌థ‌కం ద్వారా వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న కల్పిస్తారు. అంతే కాకుండా రైతులకు శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నారు. తొలిద‌శలో ఈ పథకాన్ని ఉత్పాద‌క ఉన్న‌ 100 వ్య‌వ‌సాయ‌క జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేయ‌నున్నారు. తొలుత తెలంగాణ‌లోని జ‌న‌గామ‌, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల‌, నాగ‌ర్ క‌ర్నూల్లో అమలు చేయనున్నారు. అదే విధంగా ఏపీలోని అల్లూరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ప్రారంభించ‌నున్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ (Aatmanirbhar Bharat) ల‌క్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించనున్న ఈ ప‌థ‌కం అమ‌లు, ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఇప్ప‌టికే కొంత‌మంది అధికారుల‌ను ఎంపిక చేశారు.


వెనుకబడిన జిల్లాల్లోనే ఈ పథకాన్ని ముందుగా అమలు చేయనున్నారు. ఆ ప్రాంతాల్లో సాగు నీరు దొరక్కపోవడం, ఎరువులు దొరక్కపోవడం, భూసారం సరిగా లేకపోవడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,000 కోట్లను ఖర్చు చేయబోతోంది. ఆ 100 జిల్లాల్లో వ్యవసాయ విప్లవం తేవాలని భావిస్తోంది. ఈ పథకం 2025 నుంచి 2031 వరకు 6 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఈ స్కీంతో 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం అందే ప్రణాళితో ముందుకు వెళ్తోంది. దిగుబడి తక్కువగా ఉన్న, ఎక్కువ పంటల్ని పండించని, బ్యాంక్ రుణాలు సరిగా అందని జిల్లాలను ఎంచుకున్నామని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Chennai News: కేతిరెడ్డి డిమాండ్.. జయ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

Opposition Absent as JPC: కళంకిత నేతల బిల్లుపై విపక్షం లేకుండానే జేపీసీ

Updated Date - Oct 11 , 2025 | 02:47 PM