Chennai News: కేతిరెడ్డి డిమాండ్.. జయ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:43 AM
దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.
- ప్రధాని, కేంద్ర హోంమంత్రి, సీఎంకు కేతిరెడ్డి లేఖ
చెన్నై: దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి(Kethireddy Jgadeeshwar Reddy) ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆ ముగ్గురికీ వేర్వేరుగా లేఖలు పంపించారు. జయ మృతిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎ.ఆర్ముగస్వామి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయగా, 2022 ఆగస్టు 27న నివేదిక సమర్పించిందన్నారు.

మళ్లీ అదే ఏడాది అక్టోబరు 17న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మరో జీవో ద్వారా మరికొన్ని కీలక విషయాలు వెల్లడించిందన్నారు. జయకు ఆస్పత్రి అందించిన చికిత్సలో తీవ్ర లోపాలున్నాయని, వీకే శశికళ, డాక్టర్ కేఎస్ శివకుమార్, డాక్టర్ జె.రాధాకృష్ణన్, డాక్టర్ సి.విజయభాస్కర్ వ్యవహార శైలిపై విచారణ జరపాలని కమిషన్ సూచించిందని తెలిపారు.

రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకూ ఎలాంటి చట్టపరమైన చర్యలు ప్రారంభం కాలేదన్నారు. అందువల్ల ఆర్ముగస్వామి కమిషన్ సిఫారసుల మేరకు సీబీఐతో వెంటనే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కేతిరెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News