Home » Jayalalitha
తమిళనాడు రాష్ట్రంలో 2017 ఏప్రిల్ 23న కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు జారీ అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్ పేరుతో విలాసవంతమైన భవనం ఉండగా సెక్యూరిటీ గార్డును హతమార్చి అందులోని నగదు, నగలు ఎత్తుకెళ్లారనే విమర్శలొచ్చాయి.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో.. మళ్లీ ‘అమ్మ’పాలన రావాలని పలువురు నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థమైపోయిందన్నారు.
దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్‌ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్‌లో వాచ్‌మన్ హత్య, మరోవాచ్‌మన్‌పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్‌రూమ్ ఇన్‌ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసు విచారణకు సయాన్ హాజరయ్యారు. నీలగిరి జిల్లాలో జయలలితకు చెందిన అత్యంత ఖరీదైన ‘కొడనాడు ఎస్టేట్’ ఉంది. దీంట్లోనే జయలలితకు చెందిన బంగారం నగలు, భూముల పత్రాలు, ఇతరత్రా ఆసంతులకు సంబంధించిన పత్రాలు ఉండేవని సమాచారం.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ హత్యకు సంబంధించి ‘ఇంటర్‌పోల్’ విచారణ నివేదిక కోసం వేచి ఉన్నామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. జయలలితకు ఊటీ సమీపంలో కొడనాడు ఎస్టేట్ పేరుతో పెద్దపెద్ద భవనాలున్నాయి.
Jayalalitha Assets: తమిళ ప్రజల ఆరాధ్య దైవం అమ్మగా జయలలిత ఖ్యాతి పొందారు. 2016 డిసెంబర్‌లో ఆమె తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.