Share News

VK Shashikala: మళ్లీ ‘అమ్మ’పాలన రావాలి..

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:30 AM

రాష్ట్రంలో.. మళ్లీ ‘అమ్మ’పాలన రావాలని పలువురు నేతలు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలురు మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థమైపోయిందన్నారు.

VK Shashikala: మళ్లీ ‘అమ్మ’పాలన రావాలి..

- వీకే.శశికళ

చెన్నై: దివంగత మాజీముఖ్యమంత్రి జయలలిత 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె స్నేహితురాలు వీకే.శశికళ, మాజీముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), అమ్మా మక్కల్‌ మున్నెట్ర కళగం (ఏఎంఎంకే)ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సహా వారి మద్దతుదారులు శుక్రవారం పెద్దసంఖ్యలో జయలలిత(Jayalalitha) సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శశికళ మీడియాతో మాట్లాడుతూ... చీలికలైన అన్నాడీంకే మళ్లీ ఏకమై అమ్మ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా అమ్మ అభిమానులు పనిచేయాలని ఆమె సూచించారు.


nani1.2.jpg

సినీ రాజకీయ రంగాల్లో చక్రం తిప్పిన ఎంజీఆర్‌, జయలలితలు నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడరని, ఆలోచించి వారు తీసుకున్న నిర్ణయాల వల్ల అన్నివర్గాల ప్రజలు లబ్ధిపొందారని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్ల డీఎంకే ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. వర్షాకాలంలో జనజీవనం స్తంభించకుండా రోడ్లు, డ్రైనేజీల మరమ్మతుల కోసం సుమారు రూ.6,148కోట్లు ఖర్చుచేసినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, అయితే గత వారంరోజులుగా కురుస్తున్న వర్షానికి రాజధాని నగరంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు నీట మునిగాయని, దీన్నిబట్టి సీఎం స్టాలిన్‌ పాలన ఏపాటిదో ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. తాజాగా తిరుప్పరంకుండ్రం ఆలయ వ్యవహారాన్ని అధికార డీఎంకే రాజకీయంగా మార్చిందని శశికళ వ్యాఖ్యానించారు.


సీఎం అభ్యర్థిగా ఈపీఎస్‌ ఉండే కూటమికి దూరం: టీటీవీ దినకరన్‌

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) సీఎం అభ్యర్థిగా ఉండే కూటమికి తాను దూరంగా ఉంటానని అమ్మా మక్కల్‌ మున్నెట్ర కళగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పేర్కొన్నారు. జయ సమాధి వద్ద నివాళులర్పించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేను కోట్లాది మంది కార్యకర్తలు నడిపిస్తున్నారని, ఈపీఎస్‏ను నేతగా ఎవరూ చూడడంలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుపై వచ్చే జనవరిలో నిర్ణయం తీసుకోనున్నట్లు దినకరన్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 11:31 AM