Share News

Kodanad Estate: కొడనాడు ఎస్టేట్‌ కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు..

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:29 PM

తమిళనాడు రాష్ట్రంలో 2017 ఏప్రిల్‌ 23న కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు జారీ అయింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్‌ పేరుతో విలాసవంతమైన భవనం ఉండగా సెక్యూరిటీ గార్డును హతమార్చి అందులోని నగదు, నగలు ఎత్తుకెళ్లారనే విమర్శలొచ్చాయి.

Kodanad Estate: కొడనాడు ఎస్టేట్‌ కేసులో ముగ్గురికి అరెస్టు వారెంటు..

చెన్నై: నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌(Kodanad Estate)లో జరిగిన హత్య, దోపిడీ కేసులో వరుసగా విచారణకు హాజరుకాని ముగ్గురికి న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీచేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు వీకే.శశికళకు సొంతమైన కొడనాడు ఎస్టేట్‌ లో 2017 ఏప్రిల్‌ 23న సెక్యూరిటీ గార్డును హతమార్చిన ఓ ముఠా బంగ్లాలో చొరబడి కొన్ని కీలక దస్తావేజులను అపహరించింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సయన్‌ సహా పది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు.


nani5,2.jpg

ఈ నేపథ్యంలో, ఇక్కడ జరిగిన హత్యా, దోపిడీ కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం జరిగిన విచారణకు ప్రభుత్వ తరుఫు న్యాయవాది కనకరాజ్‌, సీబీసీఐడీ ఏడీఎస్పీ మురుగవేల్‌, నిందితుల తరుఫున న్యాయవాది జితిన్‌జాయ్‌ హాజరయ్యారు. న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం ఈ కేసులో వరుసగా విచారణకు హాజరుకాని సదీశన్‌, దిబు, సంతోష్ స్వామిలకు న్యాయమూర్తి మురళీధరన్‌ అరెస్టు వారెంటు జారీచేసి తదుపరి విచారణ జనవరికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.


nani5.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 01:29 PM