Share News

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:47 PM

రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ అభిప్రాయపడ్డారు.

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

- అన్నాడీఎంకే మరింత బలపడాల్సి ఉంది

- జన్మదిన వేడుకల్లో వీకే శశికళ

చెన్నై: రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ(VK Shashikala) అభిప్రాయపడ్డారు. స్థానిక పోయెస్‌ గార్డెన్‌లో ఉన్న నివాసంలో సోమవారం తన 71వ జన్మదినం సందర్భంగా ఆమె తమ మద్దతుదారులతో పేదలకు సంక్షేమ సహాయాలు అందించారు.


అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక నాటకమాడుతోందన్నారు. 2020లో జీసీసీలో పనిచేసిన తాత్కాలిక పారిశుధ్య కార్మికుల వ్యవహారంలో అప్పటి సీఎం జయలలిత ఆచీ..తూచి.. వ్యవహరిస్తే, ప్రతిపక్షనేతగా ఉన్న స్టాలిన్‌ వారిని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారన్నారు. 2021 డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచి నాలుగేళ్లయినా పర్మినెంట్‌ చేయలేదన్నారు.


nani5.jpg

ప్రభుత్వానికి ఎన్ని శాఖలున్నాయి? ఎంతమంది కార్యదర్శులున్నారు? వారితో ఎలా పనిచేయించాలో కూడా తెలియని వారు అధికారంలో ఉన్నారన్నారు. ఆచరణకు సాధ్యంకాని హామీల కోసం కోట్లాది మంది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నగదును సొంతంగా ఖర్చుచేయడాన్ని ఖండిన్నానన్నారు. గడువు తీరిన టోల్‌గేట్లను మూసివేయడంలేదన్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి కార్‌రేస్‌ నిర్వహణకు రూ.200 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేశారన్నారు. నిధులు కేటాయింపుపై కేంద్రప్రభుత్వాన్ని దూషించడమే డీఎంకే ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 01:47 PM