Gold Rates: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:06 AM
పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి మీ నగరంలో ధర ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు కల్పిస్తూ బంగారం ధర గత కొన్ని రోజులుగా తగ్గుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరులు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,01,160గా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగి రూ.1,17,000కు చేరుకుంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర రూ.37,850గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే,22కే,18కే) ధరలు ఇలా..
చెన్నై: ₹1,01,160; ₹92,730; ₹76,680
ముంబయి: ₹1,01,160; ₹92,720; ₹75,860
ఢిల్లీ: ₹1,01,320; ₹92,890; ₹76,000
కోల్‌కతా: ₹1,01,170; ₹92,740; ₹75,880
బెంగళూరు: ₹1,01,170; ₹92,740; ₹75,880
హైదరాబాద్: ₹1,01,170; ₹92,740; ₹75,880
కేరళ: ₹1,01,170; ₹92,740; ₹75,880
పుణె: ₹1,01,170; ₹92,740; ₹75,880
వడోదరా: ₹1,01,220; ₹92,790; ₹75,920
అహ్మదాబాద్: ₹1,01,220; ₹92,790; ₹75,920
వివిధ నగరాల్లో వెండి ధరలు
చెన్నై: ₹1,27,100
ముంబయి: ₹1,17,100
ఢిల్లీ: ₹1,17,100
కోల్‌కతా: ₹1,17,100
బెంగళూరు: ₹1,17,100
హైదరాబాద్: ₹1,27,100
కేరళ: ₹1,27,100
పుణె: ₹1,17,100
వడోదరా: ₹1,17,100
అహ్మదాబాద్: ₹1,17,100
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగారంపై టారిఫ్‌లు ఉండవన్న ప్రకటన ఊరనిచ్చింది. మరోవైపు, ఆర్బీఐ జోక్యంతో రూపాయి బలపడి బంగారం దిగుమతులు చవకగా మారాయి. దీంతో, దేశీయంగా ధరలు స్వల్పంగా తగ్గాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం