Opposition Absent as JPC: కళంకిత నేతల బిల్లుపై విపక్షం లేకుండానే జేపీసీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:51 AM
తీవ్రమైన నేరారోపణలపై 30 రోజుల పాటు అరెస్టయిన ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లులను సమీక్షించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో చేరడంపై ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు.....
న్యూఢిల్లీ, అక్టోబరు 10: తీవ్రమైన నేరారోపణలపై 30 రోజుల పాటు అరెస్టయిన ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లులను సమీక్షించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో చేరడంపై ప్రతిపక్షాలు నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే ఎంపీలతో పాటు, చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీలతో కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు అనేకసార్లు రిమైండర్లు పంపామని, అయితే జేపీసీకి సభ్యులను నామినేట్ చేస్తారా లేకుంటే బాయ్‌కాట్ చేస్తారా అనేదానిపై స్పీకర్ ఓం బిర్లాకు వారు ఇంకా సమాచారం ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా జేపీసీ ఏర్పాటైతే అది దేశ చరిత్రలోనే అసాధారణమైన ఘటనగా మిగిలిపోతుందని లోక్‌సభ మాజీ సెక్రటరీజనరల్ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు.