Share News

Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం

ABN , Publish Date - Oct 19 , 2025 | 10:00 AM

అన్నదాత పంట పండింది.. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ సేకరించేవారు.

 Kharif Crop: ఖరీఫ్‌.. రైతుల ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ప్రారంభం
Kharif Crop

ఖరీఫ్‌.. రిలీఫ్‌!

చివరి వరకూ సాఫీగా కొనుగోళ్లు

8 27 నుంచి 221 కేంద్రాలు ఏర్పాటు

8 5.31 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి

8 4 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి): అన్నదాత (Farmers) పంట పండింది.. ఖరీఫ్‌ సీజన్‌ (Kharif Crop)లో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏటా సాధారణంగా 2.5 మెట్రిక్‌ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకూ సేకరించేవారు. దీంతో చివరిలో రైతులు ఇబ్బంది పడేవారు.గత రబీ సీజన్‌లో చివరి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రబీలో ధాన్యం మంచి ధరకు కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల్లో నగదు రైతు ఖాతాల్లో జమ చేయడంతో అందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన సంగతి తెలిసింది.


దీంతో చివరి పంట రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతుల నుంచి ఈ సీజన్‌లో ఎక్కువ ధాన్యం కొనుగోలుకు నిర్ణయించింది. మొత్తం 5.31 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని వ్యవ సాయశాఖ అంచనా వేయగా అందులో 4 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం సీఎంఆర్‌కు సేకరించడానికి ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు లక్ష్యం నిర్ధేశించింది.ఈ నెల 27 నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు.


74,793 హెక్టార్లలో సాగు

జిల్లాలోని 18 మండలాల పరిధిలో 74, 793 హెక్టారల్లో ఖరీఫ్‌ సాగు చేశారు. ఇప్పటి వరకూ 445.9 హెక్టార్లలో వరి కోతలు పూర్త య్యాయి. దీపావళి తర్వాత కోతలు పుంజు కుని డిసెంబరు 15వ తేదీ వరకూ కోతలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోలు ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు. 221 రైతు సేవా కేంద్రాల్లో ఒకేసారి ధాన్యం కొనుగోళ్లు ఆరంభిస్తారు.17 శాతం తేమ ఉంటే కనీస మద్దతు ధర ప్రకారం కామన్‌ వెరైటీ క్వింటా ధాన్యానికి రూ.2369, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2389 ఇవ్వవలసి ఉంది. గోనె సంచుల వినియోగచార్జీలు, కూలీల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. క్వింటాకు గోనె సంచుల వినియోగచార్జీ రూ.4.74, కూ లీల చార్జీ రూ.22 వరకూ ప్రభుత్వం ఇస్తుంది. మద్దతు ధరతో చార్జీలకు సంబంధం లేదు.


ఇవి కూడా చదవండి..

ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే

ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2025 | 12:04 PM