Lokesh Australia Visit: ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:56 PM
ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రేపటి (ఆదివారం) నుంచే ఈ పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని లోకేష్‌కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ప్రత్యేక ఆహ్వాన లేఖను పంపిన విషయం తెలిసిందే.
అమరావతి, అక్టోబర్ 18: ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minster Nara lokesh) ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు మంత్రి. సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు.
కాగా.. ఏపీకి భారీ పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఇప్పటికే వివిధ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయా పర్యటనలు విజయవంతమై అనేక కీలక పెట్టుబడులను రాష్ట్రానికి తీసువచ్చారు. తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రేపటి (ఆదివారం) నుంచే ఈ పర్యటన కొనసాగనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని లోకేష్‌కు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ప్రత్యేక ఆహ్వాన లేఖను పంపిన విషయం తెలిసిందే.
మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో మంత్రి లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు ఎస్‌వీపీలో భాగస్వామ్యం కావాలని ఆహ్వాన లేఖలో పేర్కొంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈనెల 24 వరకు ఆ దేశానికి వెళ్లి మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మరోవైపు విశాఖ వేదికగా వచ్చే నెల (నవంబర్) 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సిడ్నీ, మెల్‌బోర్న్‌లలో మంత్రి లోకేష్ రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..
Read Latest AP News And Telugu News