AP Ministerial Sub Committee Meeting: ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:01 PM
ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం ఈరోజు (శనివారం) సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. నాలుగు డీఏలు చెల్లించాలని కోరతామని.. అవి ఈరోజు కాకపోయినా దశల వారీగా అయినా చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో సక్రమ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై నేటి భేటీలో ఓ రూట్ మ్యాప్ వస్తుందని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు..
హోంమంత్రి పేరుతో బురిడీ.. మోసపోయిన శ్రీవారి భక్తులు
Read Latest AP News And Telugu News