Share News

Tirumala Fraud: హోంమంత్రి పేరుతో బురిడీ.. మోసపోయిన శ్రీవారి భక్తులు

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:22 AM

శ్రీవారి సేవా టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. ఏకంగా హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు దళారి అశోక్. ఇతడి మాటలు నమ్మిన భక్తులు బాగానే సమర్పించారు.

Tirumala Fraud: హోంమంత్రి పేరుతో బురిడీ.. మోసపోయిన శ్రీవారి భక్తులు
Tirumala Fraud

తిరుమల, అక్టోబర్ 18: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆ శ్రీనివాసుడిని కనులారా వీక్షించి పునీతులవుతుంటారు భక్తులు. ఏడాదిలో ఒక్కసారన్నా తిరుమలకు రావాలని తపించిపోతుంటారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల కొందరు మోసపూరితంగా వ్యవహరిస్తుంటారు. శ్రీవారి దర్శనం టికెట్లు ఇస్తామని.. దగ్గరుండి శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామంటూ భక్తులను నమ్మబలుకుతారు. వీరి మాయమాటలు నమ్మిన కొందరు భక్తులు త్వరగా శ్రీవారి దర్శనం అవుతుందని భావించి వారికి డబ్బులు ఇస్తుంటారు. తీరా తిరుమలకు వెళ్లాక సదరు వ్యక్తి మోహం చాటేయడంతో తాము మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటుంటారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే తిరుమలలో చోటు చేసుకుంది. శ్రీవారి సేవా టికెట్ల పేరుతో మోసానికి పాల్పడ్డాడు దళారి.


శ్రీవారి సేవా టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. ఏకంగా హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు దళారి అశోక్. ఇతడి మాటలు నమ్మిన భక్తులు బాగానే సమర్పించారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా భక్తుల నుంచి దాదాపు 4 లక్షల 10వేల రూపాయలు వరకు వసూలు చేశాడు దళారీ. అయితే డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ ఆఫ్ చేసి దళారీ పరారయ్యాడు. అయితే దళారీ చేతిలో మోసపోయమని గ్రహించిన తెలంగాణకు చెందిన బజ్రంగ్ అమన్ గోయల్.. విజిలెన్స్ వింగ్‌ను ఆశ్రయించాడు. దళారీ మోసం గురించి ఈ మెయిల్ ద్వారా టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు భక్తుడు. విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి దళారీల పట్ల శ్రీవారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

తీవ్ర విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

మోదీ వికసిత్ భారత్, చంద్రబాబు విజన్ ఆంధ్రతో మంచి ఫలితాలు..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2025 | 12:28 PM