Share News

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

ABN , Publish Date - Oct 18 , 2025 | 07:47 AM

సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్‌ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

పల్నాడు: రైల్లో అత్యాచారం కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. బాధిత మహిళా సిమ్ తన ఫోన్‌లో వేసుకోవడంతో నిందితుడు దొరికినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు వాసిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుడు జొన్నలగడ్డ రాజారావును తెనాలి రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 13న సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. గతంలో కూడా రైళ్లలో మరో ఇద్దరు మహిళలపై అత్యాచారం ఘటనలు జరిగాయి. దీంతో ఈ ఘటనపై ప్రత్యేక విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారం చేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్‌ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది. గుంటూరు స్టేషన్‌కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదులుతుండగా.. జొన్నలగడ్డ రాజారావు వచ్చి మిగతా బోగీల డోర్లన్నీ లాక్‌ చేసి ఉన్నాయని తీయమని బతిమాలాడటంతో తీసింది.


దీంతో అందులోకి ఎక్కిన జొన్నలగడ్డ రాజారావు.. 20 నిమిషాల తర్వాత తన వద్దనున్న కత్తి చూపి బెదిరించాడు. దీంతో డబ్బులున్న బ్యాగు, మొబైల్‌ ఫోన్‌ను అక్కడే వదిలేసిన బాధితురాలు బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుంది. బ్యాగు కింద పారేస్తానని బెదిరించడంతో ఆమె డోర్‌ తీసి చూడబోగా బలవంతంగా బాత్రూం బయటకు లాగిన ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెదకూరపాడు స్టేషన్‌ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న నగదు రూ.5,600, ఫోన్‌ తీసుకొని కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు చర్లపల్లిలో దిగి రైల్వే పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు జొన్నలగడ్డ రాజారావును అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

PM Janman Awards: రాష్ట్రానికి పీఎం జన్‌మన్‌ అవార్డులు

ISRO: నవంబరు చివర్లో బ్లూబర్డ్‌ ప్రయోగం

Updated Date - Oct 18 , 2025 | 08:09 AM