Home » Railway News
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.
తిరుచానూరు.. తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్ఫారం నంబరు 10లో మంగళవారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గతంలో ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడేవారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
విశాఖ టు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్ నవంబర్ నెల 4వ తేదిన ఉదయం 9.10 గంటలకు విశాఖలో బయలుదేరుతోంది. ఆ మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.
దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగుల కోసం కేంద్రం 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.