స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:23 PM
ఇటీవల ఇండియన్ రైల్వేలో వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రైల్వేలు తక్కువ ఖర్చు, సురక్షితమైన రవాణా వ్యవస్థ. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైల్వే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ, గత కొంత కాలంగా వరుస రైలు ప్రమాదాలు(Train accidents) ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మంటలు అంటుకున్నాయి.
ఆదివారం ఉదయం రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్ జిల్లాలోని జేతా-చందన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఢిల్లీ(Delhi) నుంచి వస్తున్న స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్(Swarnagiri Express) రైలులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు దట్టమైన పొగను గమనించి కేకలు వేయడంతో లోకో పైలట్(Loco Pilot) అప్రమత్తమై రైలును వెంటనే నిలిపివేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగగానే ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్
వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..