Sankranti 2026: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:49 PM
దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుంది.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుంది. దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో కొన్ని వేల మంది ప్రయాణీకులకు మేలు జరగనుంది. జనవరి 7వ తేదీనుంచి 12వ తేదీ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ప్రత్యేక రైళ్ల లిస్ట్ ఇదే..
కాకినాడ టౌన్ - వికారాబాద్
వికారాబాద్ - పార్వతీపురం
పార్వతీపురం - వికారాబాద్
పార్వతీపురం - కాకినాడ టౌన్
సికింద్రాబాద్ - పార్వతీపురం
పార్వతీపురం - సికింద్రాబాద్
కాకినాడ టౌన్ - వికారాబాద్
వికారాబాద్ - కాకినాడ టౌన్
వికారాబాద్ - కాకినాడ టౌన్
ఈ రైళ్లలో 1ఏసీ, 2 ఏసీ, 2 ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఈ రైళ్లకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయని తెలిపింది.

ఇవి కూడా చదవండి
నానబెట్టిన వాల్‌నట్‌లు లేదా బాదం.. గుండె ఆరోగ్యానికి ఏది మంచిది?
అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ప్రకటించిన కేసీఆర్