Share News

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్

ABN , Publish Date - Jan 25 , 2026 | 07:55 AM

గౌహతి (కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించిన మొదటి వందే భారత్ స్లీపర్ రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్
Vande Bharat Sleeper Train,

ఇంటర్నెట్ డెస్క్: వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యయం అని చెప్పాలి. ఈ ట్రైన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తై.. పట్టాలకెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను గౌహతి(కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించారు. తొలి వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper)రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు 'ఫారినర్ POV: వందే భారత్ స్లీపర్ రైలు' అనే శీర్షికతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కామాఖ్య నుంచి హౌరా మధ్య తన ప్రయాణంలో రైలులోని ఆధునిక డిజైన్, సౌకర్యం, ఆన్‌బోర్డ్ సౌకర్యాలను ఎంతో అద్భుంగా ఉన్నాయని భూటాన్ (Bhutan) కి చెందిన ప్రముఖ ట్రావెల్ క్రియేటర్ అనూష తెలిపింది.


‘ఇది గౌహతి నుంచి కోల్‌కొతాకు వెళ్తున్న వందే భారత్ స్లీపర్ రైలు.. నేను మొదటి రోజే దీనిలో ప్రయాణిస్తున్న. ఈ రోజు మొత్తం ఇందులో ప్రయాణించాలని నిర్ణయించుకున్న. రైలు ప్రీమియం-లుకింగ్, ఆటోమెటిక్ గ్లాస్ డోర్లు, మెరిసిపోతున్న ఇంటీరియర్, సీటింగ్ సౌకర్యాలు చాలా అద్బుతం. ఇందులో ఫుడ్ విమానంలో వడ్డించే భోజనంలా అనిపించింది. ఇలాంటి రైళ్లలో ప్రయాణం చేస్తే అసలు సుదూర ప్రయాణం చేసినట్లు ఉండదు. నిజాయితీగా చెప్పాలంటే.. ఇది నన్ను చాలా బాగా ఆకట్టుకుంది’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.


ఇవి కూడా చదవండి..

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..

ఈమెకు సహాయం చేయండి.. ఈ ఇంటి తాళం చెవి ఎక్కడుందో 13 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 25 , 2026 | 08:12 AM