అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. స్థంభించిన జన జీవనం.. వేల విమాన సర్వీసులు రద్దు..
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:46 PM
అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది కష్టాలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు, వర్షం కురుస్తున్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది కష్టాలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు, వర్షం కురుస్తున్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది (United States blizzard).
ఈ భీకర మంచు తుఫాను కారణంగా అమెరికాలో వేల కొద్దీ విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. శనివారం 3,200 విమాన సర్వీసులు, ఆదివారం మరో 4,800 విమాన సర్వీసులు రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ అవేర్ వెల్లడించింది. రానున్న కొద్ది రోజుల్లో ఈ మంచు తుఫాను ప్రభావం మరింత ఎక్కువ కావొచ్చని, ఈ నేపథ్యంలో రవాణా కష్టాలు మరింత పెరగవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు (flights cancelled USA).

మంచు తుఫాను కారణంగా అమెరికాలోని కెంటకీ, కాన్సస్, వర్జీనియా, జార్జియా, మిసిసిపి రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి (extreme weather US). ఈ దశాబ్దంలోనే ఇది భారీ మంచు తుఫాను అని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సుదూర ప్రయాణాలు చేస్తే మంచులో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చదవండి:
చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్