ఓటర్ల జాబితాలో తప్పులుంటే బీఎల్‌వోలపై చర్యలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:41 AM
ఓటర్ల జాబితా తయారీలో క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్ లెవల్ అధికారి(బీఎల్‌ఓ) కీలకం. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడడం....
న్యూఢిల్లీ, జనవరి 24: ఓటర్ల జాబితా తయారీలో క్షేత్ర స్థాయిలో పనిచేసే బూత్ లెవల్ అధికారి(బీఎల్‌ఓ) కీలకం. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడడం, జాబితా తయారీ పారదర్శకంగా, విశ్వసనీయతను కలిగి ఉండడంపై ఎలక్షన్ కమిషన్(ఈసీ) మరింతగా దృష్టి పెట్టింది. బీఎల్‌ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఎన్నికల చట్టాలను ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. బీఎల్‌ఓ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని జిల్లా ఎన్నికల అఽధికారి భావిస్తే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) ఆమోదంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చని తెలిపింది. ఇలాంటి కేసుల్లో క్రమశిక్షణ చర్యలను సీఈఓ ముందస్తు అనుమతి లేకుండా ముగించడానికి వీలులేదని పేర్కొంది.