Share News

గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

ABN , Publish Date - Jan 25 , 2026 | 02:48 AM

గణతంత్ర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

గణతంత్ర వేడుకలకు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ, జనవరి 24: గణతంత్ర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేడుకలు జరిగే కర్తవ్యపథ్‌లో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు భారీగా మోహరించాయి. భద్రతా కారణాల దృష్ట్యా కర్తవ్యపథ్‌ పరిసరాల్లో జరుగుతున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఎర్రకోట సమీపంలో నవంబర్‌లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఈసారి స్నైపర్ల సంఖ్యను రెట్టింపు చేయడంతో పాటు ప్రతి భవనం వద్ద యాంటీ డ్రోన్‌ బృందాలను నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 02:48 AM