Indian Railways: రైల్వేట్రాక్ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:15 PM
భారతీయరైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.
దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఇతర వాహనాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాదు, తక్కువ ధరలో సుధూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే నిరుపేద, మధ్యతగతి ప్రజలు, ఉపాధి,ఉద్యోగాల కోసం వెళ్లేవారు లక్షల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. భారత దేశ వ్యాప్తంగా ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్లు (Railway stations) ఉన్నాయి. నిత్యం 22 వేల రైళ్లు ప్రయాణిస్తుంటాయి. సాధారణంగా రైళ్లలో ప్రయాణించేటపుడు, రైల్వే ట్రాక్(Railway track) ఇరువైపులా అనేక రకాల బోర్డులు (Boards) కనిపిస్తుంటాయి. కొన్ని బోర్డులపై విచిత్రమైన కోడ్‌లు కనిపిస్తుంటాయి.
రైల్వే ట్రాక్ ఇరువైపుల ఏర్పాటు చేసిన బోర్డుల్లో T/P, T/G కనిపిస్తుంటాయి. ఇవి కేవలం సంకేతాలు(Signals) మాత్రమే కాదు, రైలు ప్రయాణికు(Train passengers)లకు భద్రత కోసం ఏర్పాటు చేసిన సూచికలు. వీటిని ‘టర్మినేషన్ ఇండికేటర్లు’ (Termination Indicators)అని పిలుస్తారు. T/P (Termination for Passenger Trains) ఇది ప్యాసింజర్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్లకు సంబంధించింది. T/G (Termination for Goods Trains) ఇది సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్ల (Goods trains)కు సంబంధించింది.
రైల్వే ట్రాక్ పై ఎక్కడో అక్కడ మరమ్మతు పనులు జరుగుతూనే ఉంటాయి. ట్రాక్ బలహీనంగా ఉన్నపుడు.. రైలు వేగాన్ని (Speed Restriction) తగ్గించడానికి లోకో పైలట్ (Pilot) వేగం కంట్రోల్ చేయడానికి ఈ బోర్డుల ద్వారా సూచిస్తుంటారు. వేగ పరిమితి ఎక్కడ ముగించాలో ఈ T/P, T/G బోర్డుల ద్వారా తెలుపబడుతుంది. ఈ సూచికలు రైల్ ప్రయాణాన్ని భద్రంగా కొనసాగించేలా చేస్తాయి. సాధారణంగా ఈ బోర్డులు ఒకదాని కింద ఒకటి లేదా ఒకే స్తంభానికి వేరు వేరుగా ఉంటాయి. వేగ పరిమితి ఎక్కడైతే మొదలవుతుందో, దాని సుమారు 700 మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఈ టర్మినేషన్ బోర్డులను ఉంచుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు