Share News

GRP Annual Report: రైల్వే పరిధిలో నేరాలపై జీఆర్‌పీ ఎస్పీ ఏం చేప్పారంటే

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:51 AM

రైల్వే వార్షిక నివేదికను ఎస్పీ చందనా దీప్తి విడుదల చేశారు. కొత్త రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు సంయుక్తంగా పని చేసే వెసులుబాటు కల్పిస్తు్న్నామని ఎస్పీ తెలిపారు.

GRP Annual Report: రైల్వే పరిధిలో నేరాలపై జీఆర్‌పీ ఎస్పీ ఏం చేప్పారంటే
GRP Annual Report

హైదరాబాద్, డిసెంబర్ 31: రైల్వే పరిధిలో ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని జీఆర్‌పీ ఎస్పీ చందనా దీప్తి (GRP SP Chandana Deepti)వెల్లడించారు. బుధవారరం నాడు రైల్వే వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది 2835 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 2607 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 500 మంది చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది 629 మంది ప్రమాదంలో చనిపోతే, 529 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 1317 మంది చనిపోయారన్నారు. ఈ ఏడాది ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద 54 కేసులు నమోదు కాగా 70 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. 817 కిలోల డ్రై గంజా సీజ్ చేశామన్నారు.


ఈ ఏడాది ప్రాపర్టీ లాస్ట్ పెరిగిందని.. అలాగే రికవరీ కూడా పెరిగిందన్నారు. సీఈఐఆర్ (CEIR) ద్వారా 1322 ఫోన్‌లను రికవరీ చేశామని.. వాటిని పోగొట్టుకున్న వారికి అందచేశామని తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్‌లను 24 గంటల్లోనే ఇక్కడ రీ రిజిస్టర్ చేస్తున్నామన్నారు. ఇండియన్ క్రిమినల్ గ్యాంగ్ డేటా బేస్ తయారు చేశామని.. ఈ ఏడాది ఇదో మైలురాయని వెల్లడించారు. క్రిమినల్ గ్యాంగ్ డేటాతో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. నేరస్తులను గుర్తించడం తేలిక అవుతుందని చెప్పారు. కొత్త రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు సంయుక్తంగా పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. సీసీ కెమరాలలో ఫేస్ రికగ్నజైషన్ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే అందుబాటులో ఉందని.. నేరస్తులను గుర్తించడానికి ఇది చాలా ఉపకరిస్తుందని జీఆర్‌పీ ఎస్పీ చెప్పుకొచ్చారు.


రైల్వే ఫిర్యాదు 139 నెంబర్‌కు కాల్ వచ్చినా పది నిమిషాల్లోనే హెల్ప్ దొరికేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎంఎంటీఎస్‌లో జరిగిన ఘటన తప్పుడు ఫిర్యాదుగా దర్యాప్తులో తేలిందన్నారు. బాధితురాలికి ట్రైన్‌లో సెల్ఫీలు తీసుకోవడం అలవాటని.. సెల్ఫీలు తీసుకుంటుండగా పడినట్లు గుర్తించామన్నారు. శంకర్‌పల్లిలో రైల్వే ట్రాక్‌పై కారు తీసుకొని వెళ్ళిన ఘటనలో మహిళకు మతిస్థిమితం లేనట్లుగా గుర్తించామన్నారు. ఇటీవల నవ దంపతులు గొడవ పడిన తరువాతే రైలు నుంచి దూకినట్లుగా తేలిందన్నారు. రైల్వేలో మాదకద్రవ్యాల రవాణాపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ యేడాది రూ.7.26 కోట్ల మత్తు పదార్థాలను ధ్వంసం చేశామని చందనా దీప్తి తెలిపారు.


ఈ ఏడాది 256 కేసులు డిటెక్షన్ చేశామని చెప్పారు. ఈ సంవత్సరం జీఆర్‌పీ సికింద్రాబాద్ పరిధిలో మర్డర్ కేసులు నాలుగు నమోదు అయ్యాయన్నారు. ఈ ఏడాది కన్విక్షన్ ఒకటి ఉందని... 2024 లో ఇది జీరో ఉందన్నారు. లోక్ అదాలత్‌లో రైల్వే కేసులు 133 కేసులు రాజీ అయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం కేసు డిటెక్షన్ శాతం పది శాతం పెరిగిందన్నారు. రైల్వేలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరిగిందని.. సాంకేతికత వినియోగంలో సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని జీఆర్‌పీ ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు.


ఇవి కూడా చదివండి...

ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం..

కొత్త సంవత్సరం వేళ ఆ లింక్‌లపై జాగ్రత్త..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 31 , 2025 | 01:32 PM